సూపర్‌బుక్ కిడ్స్ బైబిల్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది మరియు ఫీచర్లు:;
పిల్లల కోసం పూర్తి బైబిల్
• పిల్లల పూర్తి బైబిల్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు
• అన్ని వయసుల పిల్లలు వినడానికి బహుళ బైబిల్ వెర్షన్‌లు మరియు ఆడియో బైబిల్ ఉన్నాయి
పిల్లల కోసం సరదా బైబిల్ ఆటలు
• 20 సరదా బైబిల్ ఆటలు ఆడండి
• బైబిల్ వర్డ్ గేమ్‌లు, బైబిల్ యాక్షన్ గేమ్‌లు మరియు బైబిల్ క్విజ్ గేమ్‌లు
పూర్తి సూపర్‌బుక్ ఎపిసోడ్‌లు
• ఎమ్మీ-నామినేట్ చేయబడిన పిల్లల బైబిల్ వీడియో యానిమేషన్ సిరీస్ నుండి 14 పూర్తి-నిడివిగల ఎపిసోడ్‌లను ఉచితంగా చూడండి - సూపర్‌బుక్
• పూర్తి ఎపిసోడ్‌లను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి చూడండి
పిల్లల కోసం రోజువారీ బైబిల్ వాక్యం
• పిల్లలు ప్రతిరోజూ బైబిల్ చదవడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం
• సరదా బైబిల్ ఆటలు ఆడుతున్నప్పుడు రోజువారీ బైబిల్ వాక్యం నేర్చుకోండి
పిల్లల బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు
• పిల్లలు దేవుడు, యేసు మరియు బైబిల్ గురించి అడిగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు
• దేవుడు ఎలా ఉంటాడు? మీ హృదయంలో యేసును ఎలా పొందగలరు? పరలోకం అంటే ఏమిటి?
• మరియు పిల్లల కోసం వందలకొద్దీ బైబిల్ ప్రశ్నలు మరియు సమాధానాలు
మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోగలరో కనుగొనండి
• సువార్త సందేశాన్ని చిన్నపిల్లలకు అనుకూలంగా పంచుకోండి మరియు మీరు దేవునితో స్నేహాన్ని ఎలా ప్రారంభించవచ్చో కనుగొనండి
ప్రజలు, స్థలాలు మరియు బైబిల్ కళాకృతులు
• పిల్లల కోసం ఈ ఉచిత బైబిల్ యాప్, బైబిల్‌లో కనిపించే వందల కొద్దీ వ్యక్తులగురించిన సమాచారం, స్థలాలు మరియు కళాఖండాలను కూడా కలిగి ఉంటుంది
• వివరణాత్మక జీవిత చరిత్రలతో కూడిన ఆకర్షణీయమైన చిత్రాలు
బైబిల్‌లోని ఉత్సాహభరితమైన విషయం
• బైబిల్ ఆధారంగా పొందుపరిచిన వీడియోలు మరియు సంభాషణా అంశాలు పిల్లలను ఆకట్టుకుంటాయి
• వచనాలకు సంబంధించిన బైబిల్ ప్రశ్నలు మరియు సమాధానాలు, బైబిల్ ప్రొఫైల్‌లు, బైబిల్ ఆటలు, వీడియో క్లిప్‌లు, చిత్రాలు మరియు మరెన్నో ఉన్నాయి
• పిల్లల బైబిల్‌లోని ప్రతి అధ్యాయం మరియు వాక్యంతో సులభంగా సంభాషించవచ్చు
బైబిల్ సంభాషణలో నిమగ్నమవ్వడం
• మా రోజువారీ బైబిల్ అన్వేషణలను తీసుకోండి - ఆరోజు ప్రోత్సాహపరిచే బైబిల్ వచనాన్ని కలిగి ఉండే ఆట సవాళ్ల సమాహారం
• పిల్లలకు ముఖ్యమనిపించిన ప్రశ్నలు - జీవితం, పరలోకం, యేసు మరియు బైబిల్ గురించి ప్రశ్నలకు బైబిల్ నుండి సమాధానాలు ఇవ్వండి
• ఆసక్తికరమైన సరదాగా ఉండే బైబిల్ క్విజ్ లో సరైన సమాధానాన్ని ఎంచుకోండి – వినోదభరిత బైబిల్ సమాధానాలతో పిల్లలకు ముఖ్యమైన ప్రశ్నలు
• సవాలు చేసే పద శోధన ఆటలో దాగిన అన్ని పదాలను కనుగొనడానికి ప్రయత్నించండి.
• బైబిల్ వచనాన్ని సరైన క్రమంలో పెట్టే ఆటలో, సమయం ముగిసేలోపు బైబిల్ వచనాల చిక్కుముడిని విప్పండి
పిల్లల కోసం వ్యక్తిగతీకరించిన బైబిల్ యాప్
• నోట్స్ తీసుకొని వాటిని బైబిల్ వచనాలకు జత చేయండి
• మీకు నచ్చిన బైబిల్ వచనాలను ఇష్టమైన/బుక్‌మార్క్ చేయండి
• వివిధ రంగులతో వాక్య భాగాలను హైలైట్ చేయండి
• పిల్లల బైబిల్‌లో మీ స్వంత ఫోటోలను జోడించండి, తద్వారా మీరు ఒక వచనంతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు స్నేహితుడి కోసం ప్రార్థించడాన్ని గుర్తుంచుకోవాలనుకుంటే, మీరు ఆ స్నేహితుడి ఫోటోను ఒక వచనానికి జోడించవచ్చు, అది వారి కోసం ప్రార్థించమని మీకు గుర్తు చేస్తుంది లేదా మీరు అద్భుతమైన సూర్యాస్తమయాన్ని ఫోటో తీసి ఉండవచ్చు, కాబట్టి మీరు ఆ ఫోటోను తీసుకొని, దానిని ఆదికాండము 1:3కి జతపరచండి, ఇక్కడ దేవుడు వెలుగును సృష్టించడం గురించి బైబిల్ చెప్తోంది
• పిల్లల బైబిల్ యాప్‌లోని మై స్టఫ్ ఆప్షన్ నుండి మీ నోట్స్ ని, ఇష్టమైన వచనాలను మరియు వ్యక్తిగత ఫోటోల పూర్తి సేకరణను చూడవచ్చు
• మీరు వేర్వేరు ఫాంట్‌లు మరియు ఫాంట్ పరిమాణాలను కూడా ఎంచుకోవచ్చు మరియు తెలుపు అక్షరాలతో చక్కని నలుపు నేపథ్యాన్ని కలిగి ఉండేలా మీ స్క్రీన్‌ను మార్చుకోవచ్చు
పిల్లల కోసం సూపర్‌బుక్ బైబిల్ యాప్ యొక్క ఇతర విశేషాలు
• సెర్చ్ అనే ఆప్షన్, బైబిల్‌ను శోధించడానికి లేదా పిల్లల బైబిల్లోని ఫీచర్‌లు మరియు సంభాషించదగిన అంశాలను శోధించడానికి మీకు సహాయపడుతుంది
• మీకు ఇష్టమైన వచనాలు, సంబంధిత బైబిల్ వచనాలతో వ్యక్తిగత ఫోటోలు మరియు మీ నోట్స్ ను స్నేహితులకు ఇమెయిల్ చేయండి
• సూపర్‌బుక్ కిడ్స్ బైబిల్ యాప్ ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్ మరియు అరబిక్ భాషలలో అందుబాటులో ఉంది.
• పిల్లల కోసం ఉద్దేశించిన ఈ ఉచిత బైబిల్, వివిధ బైబిల్ వెర్షన్‌లతో పాటు న్యూ లివింగ్ ట్రాన్స్‌లేషన్ ఆడియోను కూడా కలిగి ఉంటుంది.
పిల్లల కోసం ఉద్దేశించిన సూపర్‌బుక్ బైబిల్ యాప్ మొత్తం కుటుంబానికి అద్భుతమైన బైబిల్ అనుభవాన్ని ఇస్తుంది. ఈరోజు సూపర్‌బుక్ కిడ్స్ బైబిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు జీవితకాల సాహసాన్ని ప్రారంభించండి!;
అప్‌డేట్ అయినది
24 అక్టో, 2024