శోధన ఫలితాలతో 40% వరకు డేటాను ఆదా చేయడానికి ఆప్టిమైజ్ చేయబడిన Google Go మరింత వేగంగా వెతకడానికి ఒక తేలికైన మార్గం.
Google Goతో నమ్మదగ్గ జవాబులను త్వరితంగా పొందండి, నెమ్మదైన కనెక్షన్లు మరియు తక్కువ స్థలం గల స్మార్ట్ ఫోన్లలో కూడా. 12MB పరిమాణంలో ఉండటం వల్ల దీనిని వేగంగా డౌన్‌లోడ్ చేయడంతోపాటు మీ ఫోన్లో స్థలాన్ని కూడా ఆదాచేయవచ్చు.
తక్కువ టైప్ చేసి ఎక్కువ కనుగొనండి. ట్రెండింగ్‌లోని ప్రశ్నలు లేదా అంశాలను మీ శైలిలో పూర్తి చేయడం ద్వారా సమయాన్ని ఆదాచేయండి, లేదా మీరు దేని కోసం వెతుకుతున్నారో దానిని మీ స్వరాన్ని ఉపయోగించి చెప్పండి.
Google దానిని చదివేలా చేయండి. హైలైట్ చేయబడిన పదాలు గల ఏ వెబ్ పేజీ అయినా చదవబడుతుండగా విని సులభంగా అనుసరించవచ్చు.
మీకు కావలసినవన్నీ ఒకే యాప్‌లో పొందండి. మీకు నచ్చిన యాప్‌లు, వెబ్‌సైట్‌లు, చిత్రాలు, వీడియోలు మరియు మీరు శ్రద్ధ వహించే విషయాలపై సమాచారాన్ని చాలా సులభంగా, త్వరగా పొందండి - అన్నీ Google Go ద్వారా.
జనాదరణ పొందుతున్నవి మరియు ట్రెండింగ్‌లో ఉన్నవాటిని కోల్పోవద్దు. 'శోధన'ను నొక్కడం ద్వారా తాజా ట్రెండింగ్ అంశాలను ఇట్టే విశ్లేషించండి.
మీకు ప్రియమైన వారితో పంచుకోవడానికి పరిపూర్ణమైన శుభాకాంక్షలను కనుగొనండి. మీ ఛాట్‌లకు జీవం తీసుకొచ్చే ఉత్తమ ఫోటోలు మరియు యానిమేషన్ శుభాకాంక్షలు కనుగొనడానికి ''చిత్రాలు'' లేదా ''GIFs”లపై నొక్కండి.
భాషల మధ్య సులభంగా మారండి. ఏ సమయంలో అయినా మీ శోధన ఫలితాలు ఒక దాని నుండి మరొక దానికి మారేలా చేయడానికి రెండో భాషను సెట్ చేయండి.
మీరు ఇంటర్‌నెట్‌లో దేనిని వెతుకుతున్నా, అది మీకు వేగంగా మరియు సులభంగా కనుగొనబడేలా Google Go చేస్తుంది!
అప్‌డేట్ అయినది
7 నవం, 2024