బ్రెయిన్ ట్రేసీ, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రోత్సాహకుడు. ఆయన ప్రోత్సాహక ఉపన్యాసాలతో కోట్లాదిమంది ప్రేరణ పొంది జీవితంలో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో యీయన పుస్తకాలు పాఠకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈయన దాదాపు ఎనభై నాలుగు పుస్తకాలు ప్రచురించారు. సమయ నిర్వహణ, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన యీయన పుస్తకాలలో “ఫీనెక్స్ పరివర్తన” అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రోత్సాహక ఉపాన్యాసాలను అందించే ఒక కంపెనీకి ఛైర్మన్ కూడా.