నాదమనేది పరబ్రహ్మం యొక్క మొదటి వ్యక్తరూపంగా వేదం చెబుతుంది. భగవంతుని మొదటిపేరును, మనమెవరూ ఆయనకు పేర్లు పెట్టకముందు ఉన్న అసలైన పేరును – ‘తస్య వాచక ప్రణవ:’ అంటూ ప్రణవనాదంగా అభివర్ణించారు పతంజలిమహర్షి .
ఈ ఓంకార ప్రణవనాదం సృష్టిలో నిరంతరం మారుమ్రోగుతూనే ఉన్నది. కానీ విషయలంపటాలలో కూరుకుపోయిన మనం ఆ నిరంతరనాదాన్ని వినలేము. దైవాన్ని దర్శించలేము. కానీ సాధనతో దానిని వినవచ్చు. దర్శనాన్ని పొందవచ్చు. ఆ సాధన పేరే నాదోపాసన.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.