డారెన్ హార్డీ ఇరవయ్యేళ్ళకు పైగా వ్యక్తిత్వ వికాసం, విజయ సాధనా రంగాల్లో అగ్రగామి రచయితగా, శిక్షకునిగా విశేష సేవలను అందిస్తున్నారు. మూడు విజయవంతమైన టెలివిజన్ నెట్ వర్క్ లకు నేతృత్వం వహించి, దాదాపు వెయ్యికి పైగా టెలివిజన్ కార్యక్రమాల్ని రూపొందించారు. ఆయన ‘సక్సెస్’ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు, ప్రచురణకర్త. రిచర్డ్ బ్రాన్సన్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, డోనాల్డ్ ట్రంప్, హోవార్డ్ షుల్ట్జ్, చార్లెస్ స్క్వాబ్, జెఫ్ బెజోస్ వంటి ప్రముఖులతో డారెన్ హార్డీ ముఖాముఖి చర్చలను జరిపి, వారి విజయ రహస్యాల్ని, అనుభవ సారాంశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. ‘ది ఎంటర్ ప్రెన్యువర్ రోలర్ కోస్టర్’, ‘డిజైన్ యువర్ ఇయర్ బెస్ట్ ఎవర్’, ‘ఆర్మీ ఆఫ్ ఎంటర్ ప్రెన్యువర్స్’, ‘సక్సెస్ హాబిట్స్ ఆఫ్ సూపర్ అచీవర్స్’ వంటి ఎన్నో బహుళ పాఠకాదరణ పొందిన పుస్తకాలను రచించారు డారెన్ హార్డీ.