శివాద్వైతము, పరమేశ్వరాద్వయ సిద్ధాంతమని చెప్పబడే శైవసాంప్రదాయమునకు త్రికశాస్త్రమని పేరు. త్రికశాస్త్రములో శివ, శక్తి, నర తత్వములన్నవి ప్రసిద్ధములు. దీనిని నేడు కాశ్మీరశైవమని అంటున్నారు. దీనికి మూలమే శ్రీ మాలినీ విజయోత్తరమనే ఈ తంత్రము. అద్వైతవేదాంతము కంటే కూడా ఈ సిద్ధాంతము ఉన్నతమైనదని కాశ్మీరశైవులంటారు. దీనినాధారం చేసుకుని తన తంత్రాలోకము, తంత్రసారములను రచించినట్లు అభినవగుప్తులవారు వ్రాసినారు.
శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, తారాస్తోత్రమ్, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధమ్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.