దత్తాత్రేయులు త్రిమూర్తి స్వరూపులని నమ్మకము. ఈయన మహా జ్ఞాని మాత్రమే కాక మహా యోగి కూడా. ఈయన పరశురామునికి శ్రీవిద్యనుపదేశించెనని గాధ కలదు. అటులనే సిద్ధ సంప్రదాయమునకు అవధూత సాంప్రదాయమునకు కూడా ఈయన ఆద్యుడని నమ్మకములున్నవి. కొన్ని యోగ, తంత్ర సాంప్రదాయములు ఈయన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా భావిస్తాయి.
అన్ని యోగ గ్రంథముల వలనే ఇది కూడా సాధన వివరములను క్లుప్తముగా చెప్పిన పిదప సమర్ధుడైన గురువు వద్ద వీటిని అభ్యసించవలెనని చెప్పినది. ఇది సత్యమే. ఆధ్యాత్మిక సాధన అన్నది గురుముఖతా నేర్చుకోవలసినదే అయి ఉన్నది. ఎందుకనగా దాని యందలి రహస్యములన్నింటినీ పుస్తకములలో వివరించుట సాధ్యము కాదు.
ఈ పుస్తకమును చదివిన వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులైనచో మా కృషి ఫలించిందని భావిస్తాము.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.