లీడర్లు విజన్, సెన్స్ ఆఫ్ మిషన్ కలిగి ఉంటారు. స్త్రీ పురుషులలో ఆ మిషనను బృహత్కార్యాన్ని సాధించడానికి సాయపడగల స్ఫూర్తిని నింపి ఉత్తేజపరుస్తారు. పనిచేసేవారిని విజయంకేసి నడిపిస్తూ, తమ టీమ్ గెలిచి తీరుతుందన్న దృఢవిశ్వాసం కలిగించగల మీ సమర్ధతే లీడర్ గా మీ శక్తిని సులువుగా పదిలపరుచుకోవడానికి కీలకమైనది. బెస్టు లీడర్లు కష్టపడి పనిచేస్తారు. ఎక్కువసేపు పనిచేస్తారు. ఈ ప్రవర్తన ఇతరులు కూడా అలా పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది.