Google Maps Go అనేది ఒరిజినల్ Google Maps యాప్‌లో తేలికపాటి ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ వేరియేషన్.
ఈ వెర్షన్‌కు Chrome అవసరం (మీరు Chromeను ఇన్‌స్టాల్ చేయకూడదు అనుకుంటే, దానికి బదులుగా మీ బ్రౌజర్‌లో దయచేసి www.google.com/maps వెబ్‌సైట్‌ను ఉపయోగించండి).
మీ పరికరంలో పూర్తి Google Maps యాప్ కన్నా 100 రెట్లు తక్కువ స్పేస్‌ను తీసుకుంటూ, Google Maps Go మీ లొకేషన్, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, దిశలు, అలాగే రైలు, బస్సు, అలాగే నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి సమాచారం అందించడానికి వేగంతో రాజీ లేకుండా పరిమిత మెమరీ, కనెక్షన్ స్థిరంగా ఉండని నెట్‌వర్క్‌లతో పనిచేసే పరికరాలలో సజావుగా రన్ చేయడానికి రూపొందించబడింది. మీరు ఫోన్ నంబర్‌లు, అడ్రస్‌ల వంటి లక్షల కొద్ది స్థలాల గురించి సమాచారాన్ని సెర్చ్ చేయవచ్చు, కనుగొనవచ్చు.
• టూ-వీలర్‌లు, మెట్రో, బస్‌లు, టాక్సీ నడక, ఫెర్రీలను కలిపి అత్యంత వేగవంతమైన మార్గాన్ని కనుగొనండి
• లైవ్ సిటీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ షెడ్యూల్‌లతో మెట్రో, బస్ లేదా రైలులో ప్రయాణించండి
• మార్గ ప్రివ్యూతో దశల వారీ దిశలు, మీ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేయడంలో మీకు సహాయపడతాయి
• రియల్-టైమ్ ట్రాఫిక్ సమాచారం, ట్రాఫిక్ మ్యాప్స్‌తో అక్కడకు వేగవంతంగా వెళ్లండి
• కొత్త స్థలాలను వెతికి అన్వేషించండి
• లోకల్ రెస్టారెంట్‌లు, బిజినెస్‌లు, అలాగే ఇతర సమీప స్థలాలను వెతికి, కనుగొనండి
• కస్టమర్ రివ్యూలను చదవడం, ఆహారానికి సంబంధించిన ఫోటోలను చూడడం ద్వారా ఉత్తమమైన స్థలాలను నిర్ణయించండి
• రెస్టారెంట్ ఫోన్ నంబర్, అడ్రస్‌ను కనుగొనండి
• మీకు కావాల్సిన లేదా తరుచుగా వెళ్లే స్థలాలను సేవ్ చేసి, మీ మొబైల్ నుండి తర్వాత తొందరగా కనుగొనండి
• ఇది 70+ భాషలలో అందుబాటులో ఉంది
• 200 దేశాలు, ప్రాంతాలలో విస్తృతమైన, ఖచ్చితమైన మ్యాప్‌లు (శాటిలైట్, భూభాగంతో పాటుగా) ఉన్నాయి
• 20,000 నగరాలకు పైగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సమాచారం
• 10 కోట్లకు పైగా స్థలాలకు వివరణాత్మక బిజినెస్ సమాచారం
____
బీటా టెస్టర్ అవ్వండి: https://goo.gl/pvdYqQ
అప్‌డేట్ అయినది
24 అక్టో, 2023